కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ మూతపడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు థియేటర్స్ రీఓపెనింగ్ విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. దీంతో దర్శక నిర్మాతలు చాలా మంది వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ‘సూర్యవంశీ’, ’83’ చిత్రాలను దీపావళి, క్రిస్మస్‌కి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయంలో రిలయన్స్ సీఈఓ శిభాషిస్ సర్కార్ స్పందిస్తూ “మేం వందశాతం థియేటర్లలోనే మా ‘సూర్యవంశీ’, ‘83’ సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే ఎంత వరకు సాధ్యమో అంత వరకే వెయిట్ చేస్తాం. వీడియో ఆన్ డిమాండ్, పే ఫర్ వ్యూ.. ఇలా అనేక రకాల మార్గాలను ఆలోచిస్తున్నాం. మేం అనుకున్న తేదీలు దాటితే సినిమా విడుదల వాయిదా వేయలేం” అన్నారు.
రనుమండల్ పై లతా మంగేష్కర్ వ్యాఖ్యలు… హిమేష్ రేష్మియా మద్ధతు