కేరళలో మంగళవారం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకే రోజు నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఓటరు జాబితాలో పేరు లేదని తెలుసుకున్న ఓ వ్యక్తి కుప్పకూలిపోయి చనిపోయారు. ఈ వ్యక్తిని మణిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వయసు పైబడిన వ్యక్తులు కూడా వేర్వేరు లోక్‌సభ నియోజకవర్గాల్లో చనిపోయారు. వీరిలో ఒకరు వరుసలో నిలబడి ఉన్నప్పుడు మరణించగా, మరోకరు ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి ఓటు వేసి ఇంటికి వెళ్లిన కాసేపటికి చనిపోయారు.
విజయ (65) అనే మహిళ వడకర లోక్‌సభ నియోజకవర్గం చోక్లీలోని రామ విలాసం పాఠశాలలోని పోలింగ్ బూత్‌లో వరుసలో నిలబడి కుప్పకూలిపోయారు. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. పథనంతిట్ట జిల్లాలో పాపచన్ (80) అనే వ్యక్తి ఓటు వేసిన అనంతరం ఇదే తరహాలో మరణించారు. పోలింగ్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన 72 ఏళ్ల వేణుగోపాల మరార్ కొంత సేపటికి ప్రాణాలొదిలినట్లు స్థానిక ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఉత్తమ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచాడు: జగదీశ్‌రెడ్డి