విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి రోజు నాడు భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్‌లో గల్లంతైంది.
వివరాల్లోకి వెళితే..
శ్రీనివాస్ – సాయి ప్రియలకు రెండేళ్ల క్రితం వివాహమైంది. నిన్న మ్యారేజ్ డే కావడంతో విశాఖ వెళ్లారు. ఉదయం సింహాచలం గుడికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం చేసి సాయంత్రం బీచ్‌కి వెళ్లారు.తీరంలో కొంతసేపు గడిపిన అనంతరం 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలో కాళ్లు కడుక్కోవడానికి సాయిప్రియ కనిపించుకుండాపోయింది.భార్య కనిపించకపోవడంతో కంగారుపడ్డ భర్త పరిసర ప్రాంతాల్లో గాలించాడు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో నిన్న రాత్రంతా త్రీటౌన్ పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఇవాళ మళ్లీ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నామంటున్నారు. బిడ్డ కనిపించకపోవడంతో కన్నవాళ్లు కన్నీరుమున్నీరవుతున్నారు. బీచ్‌కి వెళ్లొస్తామని వెళ్లిన తన కూతురు తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సాయి ప్రియ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది.