telugu navyamedia
Uncategorized రాజకీయ వార్తలు

మహారాష్ట్ర హోం మినిస్టర్ రాజీనామా…

మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ దేశ్ ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హై ఈ రోజు ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు కేంద్ర ఏజెన్సీని ఆదేశించింది. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేసినట్లు ఎన్‌సిపి మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు దేశ్‌ముఖ్ ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్‌ను కలిశారని ఆయన అన్నారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు దేశ్ ముఖ్ తన రాజీనామాను పంపారు. మరాఠీలో రాసిన తన లేఖలో, దేశ్ ముఖ్ బొంబాయి హైకోర్టు ఉత్తర్వుల తర్వాత ‘నైతిక ప్రాతిపదికన’ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 

Related posts