telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తన పెళ్లిపై రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

rahul gandhi to ap on 31st

లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ విద్యార్దులతో సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రముఖ జాకీ మలిష్క సమన్వయకర్తగా వ్యవహరించారు. రాజకీయ నేతల బయోపిక్‌లు వెలువడుతున్న క్రమంలో తన బయోపిక్‌లో హీరోయిన్‌ ఎవరంటూ విద్యార్ధులు అడిగిన ప్రశ్నకు రాహుల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పనినే ప్రేమిస్తానని, పెళ్లి కూడా దాంతోనేనని నవ్వుతూ బదులిచ్చారు.

మహారాష్ట్రలోని పూణేలో శుక్రవారం ఆయన విద్యార్ధులతో ముచ్చటిస్తుండగా రాహుల్‌కు వారి నుంచి ఈ ప్రశ్న ఎదురైంది.గతంలో తనను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటిస్తున్న సందర్భంగా అడిగిన ప్రశ్నకు తాను కాంగ్రెస్‌ పార్టీని పెళ్లాడానని ఆయన చెప్పిన విషయం విధితమే.

Related posts