తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి కొత్త పురపాలక చట్టంలో తీసుకువచ్చిన మార్పులపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కొట్టం చట్టంలో టౌన్‌ప్లానింగ్‌కు సంబంధించి వినూత్న మార్పులు తీసుకొచ్చామన్నారు. ఇబ్బందులు లేని సరళమైన విధానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రజలకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండి సులభంగా సేవలు అందాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి పురపాలికకు సమగ్ర మాస్టర్‌ప్లాన్, క్యూఆర్ అధారిత డిజిటల్ డోర్ నెంబరింగ్ అమలు చేయాలి. కొత్తచట్టానికి సంబంధించి అన్ని సందేహాల నివృత్తి కోసం కస్టమర్ కేర్ నంబర్ ఏర్పాటు చేయాలి. వీలైనంత వరకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సేవలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.