telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కోవాగ్జిన్ కరోనాకు అసలైన మందు…

Corona

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసింది. అయితే భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ వినియోగం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం ఇచ్చిన విష‌యం తెలిసిందే వాస్త‌వానికి కోవాగ్జిన్ మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. కానీ ఆ టీకాకు స‌డ‌న్‌గా అనుమ‌తి ఇవ్వ‌డం ప‌ట్ల వివాదం త‌లెత్తింది. ఈ నేప‌థ్యంలో విప‌క్షాలు ఆ వ్యాక్సిన్ స‌మ‌ర్ధ‌త‌‌పై అనుమానాలు వ్య‌క్తం చేశాయి. ఎటువంటి డేటా ఇవ్వ‌కుండా కోవాగ్జిన్ టీకాకు ఎలా అనుమ‌తి ఇస్తార‌ని విప‌క్షాలు నిల‌దీశాయి. ఈ సంద‌ర్భంగా ఇవాళ భార‌త్‌బ‌యోటెక్ సంస్థ చైర్మ‌న్ కృష్ణ ఎల్లా మీడియాతో మాట్లాడారు. వ్యాక్సిన్ పై వచ్చిన ఆరోపణల పై సిఎండి కృష్ణ ఎల్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ తయారు చేసిన వ్యాక్సిన్ ని నీళ్ళతో పోల్చడం బాధాకరం అని అన్నారు. భారత్ లో ఒక టీకా అనుమతి పొందాలి అంటే ఎన్ని స్టేజ్ లు దాటాలో ఫారిన్ కంపెనీ లకు ఏం తెలుసు అని అయన ప్రశ్నించారు. టీకా ను అందుబాటు లోకి తేవడానికి ఎంత కష్ట పడ్డమో మాకే తెలుసని ఆయన అన్నారు. కోవాగ్జిన్ కరోనాకు అసలైన మందు అని పేర్కొన్న ఆయన అది 36 వేల మంది వాలంటీర్లు కృషికి ఫలితం అని అన్నారు.చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts