telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుమల స్వామి వారికి హుండీ ద్వారా 10 రోజులలో 29 కోట్ల ఆదాయం…

Tirumala

గత 10 రోజులలో తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం ద్వారా 4లక్షల 25వేల 596 మంది భక్తులు దర్శనం చేసుకున్నారన్న ఆయన స్వామి వారికి హుండీ ద్వారా రూ. 29.06 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 25న ముక్కోటి ఏకాదశి నుంచి జనవరి 3 వరకూ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం అనుమతించామన్న ఆయన స్వామి వారి ఆలయంలోని  పుష్ప అలంకరణ అద్భుతంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేసారని అన్నారు. పది రోజుల పాటు భక్తులకు ఎటువంటి అసౌఖర్యం కలగ కుండా ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. 4,52,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని, ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్కింగ్ చేసుకునే సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా సాంకేతిక లోపాలను తోలగించామని ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అలిపిరి నడకమార్గంలో 21300 మంది భక్తులు…శ్రీవారి మెట్టు నడకమార్గంలో 9789 మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 1.83 లక్షల మంది భక్తులు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లు పై ….సర్వదర్శనం టోకేన్ల పై 90852 మంది భక్తులు… శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10725 మంది భక్తులు…. దాతలు 4800 మంది భక్తులు… వర్చువల్ సేవా టిక్కెట్లు కలిగిన 38229 మంది భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారని, 20.05 లక్షల లడ్డులు విక్రయించామని, 93238 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయని 50894 గదులు  భక్తులకు కేటాయించగా … 2.27 కోట్లు ఆదాయం లభించిందని అన్నారు. 90290 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని 30టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయంలో మూడు సార్లు పుష్పాలంకరణ చేశామని అన్నారు.

Related posts