telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

త్వరలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..?

rtc city bus

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తొలుత ఏడు గంటలవరకే బస్సులను నడిపిన అధికారులు మొన్నటి నుంచి రాత్రివేళలో కూడా బస్సులను తిప్పుతున్నారు. ఇక హైదరాబాదు నగరంలో మరో వారం రోజుల్లో సిటీ బస్సులు రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సడలింపుల్లో భాగంగా చాలా వరకు కార్యాలయాలు తెరుచుకున్నాయి. అయితే, ఆఫీసులకు చేరుకునేందుకు రవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సిటీ బస్సులను తిప్పాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే జూన్ 5 నాటికి సిటీ బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి.

పూర్తిస్థాయి కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా కండక్టరు లేకుండా, స్టేజీల వద్ద టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రతిపాదించగా, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తిరస్కరించినట్టు తెలుస్తోంది. కండక్టరుతోనే బస్సులు నడపాలని యోచిస్తోంది.

Related posts