telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సాయంత్రం 6 అయితే ఇక మద్యం బంద్!

MLC Elections 3 days closed Liquor shops

ఏపీ ప్రభుత్వం మద్య నిషేదం పై ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మద్య నిషేదం పై కొత్త ప్రణాళికను జగన్ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులోభాగంగా మద్యం అమ్మకాలు తగ్గాలంటే సమయాల్లో మార్పులు తేవాలని యోచిస్తుంది. మద్యం అమ్మకాల్లో కొత్త టైమింగ్ తీసుకురానుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకే మద్యం అమ్మకాలు జరగాలని, 6 దాటితే లిక్కర్ సేల్స్ బంద్ చేయాలని భావిస్తోంది. ఈ నూతన లిక్కర్ ప్లాసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది.

నూతన మద్యం పాలసీ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో మద్యం అమ్మకాల వేళల్లో మార్పులు చేయడం వల్ల మద్యం వినియోగాన్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా లిక్కర్ సేల్స్ సమయాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటలకు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక పై అలా కాకుండా సాయంత్రం 6 గంటల వరకే పరిమితంచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Related posts