telugu navyamedia
క్రీడలు వార్తలు

నటరాజన్ ను ప్రశంసించిన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్…

భారత్ లో ఇంగ్లాండ్ పర్యటన ప్రారంభమైన దగ్గర నుండి భారత జట్టును విమర్శించిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తాజాగా భారత యువ పేసర్ నటరాజన్ ‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. నిన్న జరిగిన చివరి వన్డే లో ఇంగ్లండ్ విజయానికి 6 బంతుల్లో 14 పరుగులు కావాల్సి ఉండగా నటరాజన్‌ తన యార్కర్‌లతో మాయ చేశాడని వాన్‌ అభినందించాడు. వాన్ మాట్లాడుతూ … నిన్నటి మ్యాచ్ లో చివరి ఓవర్ లో సామ్‌ కరన్‌కు నిజంగా అది క్లిష్టమైన పరిస్థితే. అప్పటికే నటరాజన్‌ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనూ తక్కువ ఎత్తులో సామ్‌కరన్‌ ప్యాడ్స్‌ తగిలేలా బంతిని విసిరాడు. లక్షల మంది మ్యాచ్‌ చూస్తున్న సమయంలో బౌలింగ్‌ చేస్తున్న నటరాజన్‌ గుండె చప్పుడు ఏంటో అతని ముఖంలో చూడొచ్చు. సరైన యార్కర్‌ వేసి మ్యాచ్‌ను గెలిపించిన నటరాజన్‌ను ఎంత అభినందించినా తక్కువే’ అని వాన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు.

Related posts