telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బిగ్ బాస్ లో … గ్యాంగ్ లీడర్ …

Nani

బిగ్‌బాస్‌-3 తెలుగు లోకి నేచురల్‌ స్టార్‌ నానీ ఎంటర్‌ అవుతున్నాడు. నాగార్జున వ్యాఖ్యాతగా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ షోలో నాని ఈరోజు సందడి చేయనున్నారు. తన ‘గ్యాంగ్‌లీడర్‌’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నానీ ఈ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నాని నటించిన ఈ చిత్రం ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బిగ్‌బాస్‌-2కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాని అప్పట్లో నాని, నాగార్జున కథానాయకులుగా నటించిన ‘దేవదాస్‌’ సినిమా ప్రమోషన్‌ కోసం నాగార్జున బిగ్‌బాస్‌కి వచ్చారు. ఇప్పుడు నాని ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్నమాట.

Related posts