telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏప్రిల్ నాటికి.. కాళేశ్వరం నుండి సూర్యాపేటకు నీళ్లు.. : కేసీఆర్

kcr and committee meet on rtc

ముఖ్యమంత్రి కేసీఆర్ సూర్యపేట జిల్లా రైతాంగానికి తీపి కబురు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి విడుదల సూర్యపేట జిల్లాకు పరుగులు పెడుతున్న జలాలను ఏప్రిల్ మాసంతానికి పంపిణీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యపేటకు సరఫరా అవుతున్న నీళ్లు మార్చి వరకు పొదగించాలన్న రైతుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ వరకు విడుదల ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తద్వారా సూర్యపేట జిల్లాలో రెండు లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని అందుకు తానెంతో గర్వ పడుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో సూర్యపేట జిల్లా రైతాంగం ఎస్ఆర్ఎస్పీ జలాల మీద ఆధారపడి ఉండేవారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయిందన్నారు.

గోదావరి నది పై నిర్మించిన ఇల్లంపల్లి,లక్ష్మీ,సరస్వతీ, పార్వతి బ్యారేజీలలో ఉన్న 60 టిఎంసీలకు తోడు లోయర్ మానేరు,మిడ్ మానేరు లలో ఉన్న నీటి నిల్వలు 50 టి యం సి లను కలుపుకుని మొత్తం 110 టి యం సి ల నీటినిల్వలతో ఎస్ఆర్ఎస్పీ తో నిమిత్తం లేకుండానే సూర్యపేట జిల్లాకు గోదావరి జలాలు పారించవచ్చని ఇప్పుడు అదే జరుగుతోందని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటే ఇది సాధ్యం అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇటు తుంగతుర్తి నియోజకవర్గం మొదలు కోదాడ నియోజకవర్గం నడిగూడెం వరకు గోదావరి జలాలు బ్రహ్మాండంగా పారుతున్నాయన్నారు. అయితే అక్కడి రైతులు మార్చి వరకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఇంత డబ్బు పెట్టి ప్రాజెక్ట్ లు కట్టుకున్నదే నీళ్లు ఇవ్వడానికే కదా అంటూ మార్చి కాదు ఏప్రిల్ వరకు నీళ్లు పరుగులు పెడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా రైతాంగానికి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్ రెడ్డి లతో పాటు సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts