telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికా తర్వాత రష్యాపై కరోనా తీవ్ర ప్రభావం!

Corona

ప్రపంచ వ్యాప్తంగా అమెరికా తర్వాత రష్యాపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 2,32,243కి చేరుకున్నాయి. కరోనా బారిన పడిన వారిలో ఆ దేశ ప్రధానమంత్రి, ఇద్దరు మంత్రులు, అధ్యక్షుడు పుతిన్ మీడియా కార్యదర్శి కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 2,116 మంది ప్రాణాలు కోల్పోయారు.

అయితే దేశ జనాభాతో పోలిస్తే కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని రష్యా భావిస్తోంది. టెస్టుల సంఖ్య పెరగడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకు సిద్ధమైంది. కంటైన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో వ్యాపార కూడళ్లు, పార్కులు తెరుచుకుంటున్నాయి.

Related posts