తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మున్సిపాలిటీ చట్టం – 2019 బిల్లును ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు బిల్లుపై సవరణలు స్వీకరించనుంది.ఈ బిల్లుపై మంగళవారం శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. అనంతరం రాష్ట్రంలో మెడికల్, డెంటల్ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి 55 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ మరో బిల్లు ప్రవేశపెట్టారు.
మెడికల్ కళాశాలల్లో ఒక ప్రొఫెసర్ 70 సంవత్సరాల వరకు పనిచేయగలరని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసిన నేపథ్యంలో వారి వయోపరిమితిని పెంచడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. దేశమంతా ఇదే పద్ధతిని అవలంభిస్తుందని తెలిపారు. ప్రొఫెసర్లు కావాలంటే సీనియారిటీ ప్రకారం రావాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో వారి వయోపరిమితిని పెంచినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లు, తెలంగాణ రుణవిమోచన కమిషన్ బిల్లును మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.
నెలరోజుల్లో మోదీ మాజీ కావడం ఖాయం: అసదుద్దీన్