telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

కాలుష్య రహిత .. అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన సమయం.. : అంబుమణి రాందాస్‌

ambumani ramdas on global warming

ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్యంతో వేడెక్కిపోతున్న వాతావరణం వల్ల కలిగే దుష్ప్రభావాలు నివారించడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలని పిఎంకె యువజన విభాగం నేత అంబుమణి రాందాస్‌ గురువారం కేంద్రాన్ని కోరారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రామ్‌ ఇటీవల విడుదల చేసిన ఎమిషన్స్‌ గాప్‌ రిపోర్ట్‌పై ఆయన స్పందించారు. గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయని ఆ నివేదిక వెల్లడించింది.

గ్రీన్‌హౌస్‌ ఉద్గారాలను నియంత్రించడంలో భారత్‌ తన బాధ్యతను తప్పించుకోలేదని రామదాస్‌ అన్నారు. ఈ మేరకు చెన్నైలో ఒక ప్రకటన జారీ చేశారు. బగ్గు ఆధారిత అణు విద్యుత్‌ కర్మాగారాలకు సంబంధించిన ప్రణాళికలను వదులుకోవడం, పరిశ్రమలను హరిత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్చమని కోరడం, ప్రజా రవాణాను పెంచడం, వాహనాల నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని నియంత్రించడం వంటి ఐరాస పర్యావరణ కార్యక్రమంలో పేర్కొన్న చర్యలను కేంద్రం చేపట్టాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.

Related posts