telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యా వ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నాం: జగన్

cm jagan ycp

నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ నిర్వహించిన ‘జాతీయ నమూనా సర్వే’లో 96.2 శాతం తో దేశంలోనే కేరళ అగ్రస్థానంలో నిలవగా, 66.4 శాతంతో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున నిలిచిన సంగతి తెలిసిందే. పురుషుల అక్షరాస్యత రేటు 73.4 శాతంగా ఉండగా, మహిళల్లో 59.5 శాతంగా ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమ్మఒడి, విద్యాదీవెన పథకాల ద్వారా రాష్ట్రంలో విద్యావ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నామని తెలిపారు. ఈ పథకాల ద్వారా 100 శాతం అక్షరాస్యతను సాధించేందుకు ఒక మార్గాన్ని తయారు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజల జీవితాలను మార్చగల శక్తి విద్యకు మాత్రమే ఉందని తెలిపారు. 

Related posts