telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు: మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్‌లకు ఆమోదం

*ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు 
*రాష్ట్రంలో కొత్త రెవెన్యూ డివిజన్లకు కేబినెట్ ఆమోదం..
*మిల్లెట్ మిషన్ పాలసీకి ఆమోదం తెలిపిన మంత్రివర్గం
*డిగ్రీ కాలేజీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం
*డిగ్రీ కళాశాలల్లో 574 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్‌
*పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు కేబినెట్‌ ఆమోదం

ఏపీ కేబినెట్ మీటింగ్ ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ముగిసింది.24 మంది మంత్రులు రాజీనామా చేశారు. ఈ నెల 11న కొత్త కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఈ కేబినెట్ సమావేశంలో పలు కీల‌క నిర్ణయాల‌కు ఆమోద ముద్ర ప‌డింది. తాజాగా మ‌రో రెండు రెవెన్యూ డివిజ‌న్లకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వీటిలో కోనసీమ జిల్లాలోని కొత్తపేట ఓ డివిజ‌న్ కాగా… జ‌గ‌న్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మ‌రో కొత్త డివిజ‌న్‌గా ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వం 72 రెవెన్యూ డివిజ‌న్‌లను ప్రకటించగా.. తాజా రెండు రెవెన్యూ డివిజన్‌లను కలుపుకుని ఆ సంఖ్య 74కి చేరింది.

అంతేకాకుండా వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకానికి కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ మిల్లెట్‌ మిషన్‌ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు ఆమోదించారు. విద్య, వైద్య, ప్రణాళిక విభాగాల్లో నియామకాలకు ఆమోదం తెలిపింది. డిగ్రీ కళాశాలల్లో 574 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ వంటి తదితర ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

హెల్త్ హ‌బ్ ప‌థ‌కం కింద ఐదు జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేయ‌నున్న ఆసుపత్రుల నిర్మాణానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

Related posts