telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ విలీనంపై ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!

apsrtc charges increased shortly

ఆర్టీసీ విలీనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ నెల 4వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఇచ్చింది. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చాలని కమిటీ నిర్ణయించినట్లు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని తెలిపారు.

ఇందుకు సీఎం వైఎస్ జగన్ కూడా ఆమెదం తెలిపారని మంత్రి మీడియాకు వెల్లడించారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కల నెరవేరబోతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఆర్టీసీపై దాదాపు రూ. 3వేల నుంచి 3500 కోట్ల భారం పడుతుందన్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసి అందులో ఆర్టీసీ ఉద్యోగులను భాగస్వాములను చేస్తామని మంత్రి తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలని సమావేశంలో సీఎం జగన్ స్పష్టం చేశారని తెలిపారు.

Related posts