telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్…

corona

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పుడు వారిలో మరో ముఖ్యమంత్రి కూడా చేరారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే రానున్న సివిక్ పోల్స్‌లో భాగంగా ఓ ర్యాలీలో పాల్గొన్న విజయ్ రూపాని ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే అతడిని స్తానిక ఆసుపత్రికి తరలించారు. నేడు అతడికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. ‘విజయ్ రూపాని ఆరోగ్యం అంతా బాగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. అతడికి చేసిన అన్ని పరీక్షలు నార్మల్‌గానే ఉన్నాయి. అతడు మరో 24గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నార’ని డాక్టర్ ఆర్‌కే పాటిల్ తెలిపారు. ఇక మన దేశంలో ఈ వైరస్ కు వ్యాక్సిన్ ఇస్తున్న కేసులు మాత్రం తగ్గడం లేదు. రోజుకు పది వేలకు పైకా హీరోనా కేసులు వస్తున్నాయి. చుడాలిమరి ఈ కేసులు ఎప్పుడు తగ్గుతాయి అనేది.

Related posts