telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాకు వెళ్ళకండి అంటున్న అమెరికా…

india usa flag

ప్రస్తుతం మన దేశంలో కరోనా విజృంభిస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దాంతో దేశంలో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పుతుండటంతో కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధిస్తున్నాయి. కాగా భారత్ లో పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని అమెరికా అలెర్ట్ అవుతుంది. ఈమేరకు ఇండియాలో ఉన్న తమ దేశ పౌరులందరూ స్వదేశానికి తిరిగి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం కోరింది. వీలైనంత త్వరగా అమెరికాకు చేరుకోవాలని చెప్పింది. భారత్ ఎవరూ వెళ్లవద్దని, భారత్ నుంచి వచ్చేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో సురక్షితమని సూచన చేసింది. కాగా అమెరికా, భారత్ కు సాయం అందించడంలో ముందుంది. ఎప్పటికప్పుడు భారత్ పరిస్థితులను అమెరికా ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. ఈ పరిస్థితి నుండి బయటకు రావడానికి సహాయం చేస్తామని ప్రకటించింది.

Related posts