telugu navyamedia
సినిమా వార్తలు

తలైవాను కలుసుకోవాలని ఉందన్న క్రికెటర్ బ్రావో

Bravo

వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోసం ఆడుతున్నారు. చాలా కాలంగా ఆయన చెన్నై జట్టులో ఆడుతున్న కారణంగా అక్కడి కల్చర్, ఆహార పదార్ధాలు ఎంతగానో నచ్చుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ గురించి విన్నానని, కానీ ఆయన నటించిన చిత్రాలు చూడలేదని, త్వరలోనే చూస్తానని, రజినీకాంత్ ని కలుసుకోవాలని ఉందని తెలిపారు. రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలలో కూడా చాలా మంది ఆయనకు అభిమానులుగా ఉన్నారు. ఇప్పుడు బ్రావో కూడా వారి జాబితాలోకి చేరిపోయాడు.

Related posts