శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య జంటగా నటించిన “మజిలీ” చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం థియేటర్లలో ఇప్పటికి తన దూకుడును కొనసాగిస్తోంది. సాధారణంగా ఏ భాషలోనైనా ఓ సినిమా హిట్ అయితే ఆ సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఈ చిత్రాన్ని కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. త్వరలోనే తన సొంత బ్యానర్ వండర్ బార్ ఫిలింస్ సంస్థపై ధనుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడని అంటున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి డిలేటెడ్ సీన్-2ను విడుదల చేశారు. నాగ చైతన్య, పోసాని కృష్ణ మురళి, సమంత, రావు రమేష్ ల మధ్య ఈ సన్నివేశం సాగుతోంది. మారిపోయిన నాగచైతన్య “మామయ్య” అని పిలవడంతో పోసాని ఎమోషన్ అవుతూ కన్పిస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.
పవన్ ఓటమిపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్