telugu navyamedia
సినిమా వార్తలు

సమంత చేసే ఆ పని నాగ చైతన్యకు నచ్చడం లేదట…!?

samantha-and-Nagachaitanya

అక్కినేని నాగచైతన్యను వివాహమాడిన సమంత… పెళ్ళి తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటోంది. ప్రస్తుతం సమంత విజయ్ సేతుపతితో కలిసి “సూపర్ డీలక్స్” సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న సమంత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తన చిత్రాలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేయడం తన భర్త నాగచైతన్యకు నచ్చడం లేదని తెలిపింది. కానీ ఈ విషయంలో చైతూ తనపై కోపంగా లేడని, ఇక ఈ విషయంలో ఇతరుల అభిప్రాయాలను, విమర్శలను లెక్కచేయనని స్పష్టం చేసింది. గతంలో తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సమంత నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడిన విషయం తెలిసిందే.

ఇక “సూపర్ డీలక్స్” సినిమాలో తనది వ్యాంప్ పాత్ర అని, ఈ విషయం చైతూకు చెప్పగానే ఆశ్చర్యపోయాడని, కానీ తనకు కథ నచ్చడంతో ఓకే చెప్పానని తెలిపింది సమంత. “కెప్టెన్ మార్వెల్” లాంటి చిత్రాలు తెలుగులో కూడా రావాలని, అలాంటి స్టోరీలతో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనను సంప్రదిస్తే ఖచ్చితంగా సినిమా చేస్తానని తన కోరికను వెలిబుచ్చింది. కాగా తెలుగులో సమంత నటిస్తున్న “ఓ బేబీ” చిత్రం గురించి మాట్లాడుతూ వినోదభరితమైన చిత్రమని, సినిమా మొదలైనప్పటినుంచి చివరి వరకు అందరూ హ్యాపీగా నవ్వుకుంటారని చెప్పుకొచ్చింది.

Related posts