telugu navyamedia
సినిమా వార్తలు

ధనుష్ కు ఉత్తమ కమెడియన్ గా అవార్డు

dhanush

మొట్టమొదటిసారిగా ధనుష్‌ ఇంగ్లీష్‌, స్పెయిన్‌ భాషలలో రూపుదిద్దుకున్న “ది ఎక్ట్ర్సార్డిన‌రీ జర్నీ ఆఫ్‌ ఏ ఫకీర్‌” అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించాడు. స్ర్టీట్‌ మేజిక్‌ మ్యాన్ పాత్రలో ధనుష్‌ ఆ చిత్రంలో నటించాడు. తనకు ప్రత్యేక మంత్రశక్తులు వున్నట్టుగా ప్రజలను నమ్మించి మోసం చేసే కామెడీతో కూడుకున్న పాత్రలో ధనుష్‌ నటించాడు. ఇండియా, ఫ్రాన్స్‌, ఇటలీ, లిబియా తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ జరిగింది. గత వారం ఈ చిత్రం విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో స్పెయిన్‌ దేశంలోని బారిసిలోనాలో సెయింట్‌జార్జి అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరుగుతోంది. ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించారు. ఉత్తమ హాస్య చలన చిత్రం కేటగిరీలో ఈ చిత్రానికి అవార్డు లభించింది. తొలి చిత్రంతోనే బెస్ట్‌ కమెడియన్‌ అవార్డు దక్కించుకోవడం ఆనందంగా వుందని ధనుష్‌ అన్నారు.

Related posts