telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వెయ్యి డోసుల వ్యాక్సిన్‌ వృథా…

corona vacccine covid-19

దాదాపు ఏడాది కాలంగా ప్రపంచాన్ని వానికితెస్తుంది కరోనా. అయితే ఈ వైరస్ కు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది.. అన్ని రాష్ట్రాలకు చేరింది.. ఇక వ్యాక్సినేషన్‌ కూడా కొనసాగుతోంది.. అయితే, కోవిడ్ వ్యాక్సిన్‌కు స్టోరేజీ ఎంతో కీలకమైనది.. కానీ, స్టోర్‌ సిబ్బంది పొరపాటు వల్ల.. వ్యాక్సిన్‌ స్తంభించిపోయింది.. ఈ ఘటన అసోంలో వెలుగు చూసింది.. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను సిల్చార్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో స్టోర్‌ చేవారు.. అందులో వెయ్యి డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ పనికిరాకుండా పోయింది. నిబంధనల ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను -8 డిగ్రీల సెల్షియస్ వద్ద నిల్వ చేయాలి. కానీ, సిల్చార్ మెడికల్ కళాశాల ఆసుపత్రి స్టోరులో ఐఎల్ఆర్ ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా ఉంది. దీంతో, టీకాలు పాక్షికంగా స్తంభించి పోయినట్టు కాచర్ జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. అయితే, ఇది ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్‌లో సాంకేతిక లోపం కారణంగా.. ఉష్ణోగ్రత నియంత్రించలేక ఈ పొరపాటు జరిగిందని చెబుతున్నారు. ఆ 1000 డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు బదులుగా మరో బ్యాచ్ ను పంపించాలని అసోం వైద్యఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇదే సమమంలో.. ఆ ఘటనపై విచారణకు కూడా ఆదేశించింది.. సీరంకు చెందిన ఈ వ్యాక్సిన్‌ను సక్రమంగా నిల్వ చేయలేదనే ఆరోపణలతో మెడికల్ కాలేజీకి నోటీసు పంపించారు ఉన్నతాధికారులు.. ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అయితే ప్రస్తుతం దేశ వయాప్తంగా మొదటి ధర కరోనా వ్యాక్సినేషన్ నడుస్తుంది.

Related posts