telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైల్వే ప్రైవేటీకరణ.. తెలుగు రాష్ట్రాలకూ .. తప్పని పరిస్థితి..

railway privatization also include telugu routes

కేంద్రం రైల్వే రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం కల్పించేందకు సిద్దమైన విషయం తెలిసిందే. ట్రైన్లను ప్రైవేటుపరం చేయబోమని చెబుతూనే, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా రైల్వే బోర్డు చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 27న జరిగే బోర్డు జనరల్‌ బాడీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల రూట్లు సైతం ఉన్నాయి. కనీసం 150 ప్రైవేటు ట్రైన్‌ సర్వీసులు మొదలవుతాయని భారత రైల్వే ప్రకటించింది. రైల్వేలో ప్రస్తుతం 24 రూట్లను గుర్తించామని, వాటిని ప్రయివేటు సంస్థలు నిర్వహిస్తాయని తెలిపింది. ఇందులో 14 ఇంటర్‌ సిటీ సర్వీసులు, 10 ఓవర్‌ నైట్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీసులున్నాయి. నాలుగు సబర్బన్‌ సర్వీసులు – ముంబయి, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్‌ కూడా ఉన్నాయి. ఇంటర్‌ సిటీ సర్వీసుల్లో సికింద్రాబాద్‌-విజయవాడ రూట్‌ కూడా వుంది. అలాగే ఓవర్‌ నైట్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ ట్రైన్లలో సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-ఢిల్లీ సర్వీసులు కూడా ఉన్నాయి.

ఈ ప్రైవేటీకరణ వల్ల ఇప్పటి వరకు స్వల్పంగా ఉన్న టికెట్‌ ధరలు అమాంతం పెరిగే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. అక్టోబర్‌ మొదటి వారంలో రైల్వేల ప్రైవేటీకరణకు నాందీ ప్రస్థావనగా లక్నో-ఢిల్లీ మధ్య తొలి ప్రైవేట్ రైలు తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే దీని కోసం టికెట్‌ బుకింగ్‌ కూడా మొదలైంది. మిగతా కొత్త రూట్ల ట్రైన్‌ చార్జీలు ఇంకా వెల్లడించాల్సి ఉన్నది. ప్రైవేటీకరణ తో రైళ్ల నవీకరణకు దోహదం చేస్తుందని రైల్వే బోర్డు చెబుతుంది. అయితే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని రైల్వే ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం రైల్వే నెట్‌వర్క్‌ నుంచి తప్పుకొనే ప్రయత్నం చేస్తున్నదని ఆయా రైల్వే సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Related posts