telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అద్దె బస్సులకు అడ్డుపడుతున్నాడనే .. సురేందర్ ను తప్పించారా..!

apsrtc md surendrababu on employees demands

రాష్ట్రంలో ఎలేక్టిక్ బస్సులు తేవటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ బస్సులను కొనకుండా, అద్దెకు తీసుకుంటానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి, ఈ నెల 11న టెండర్లు పిలిచారు. అయితే ఈ టెండర్ లో పెద్ద పెద్ద కంపెనీలు అయిన, టాటా, అశోక్‌ లేలాండ్‌, ఐషర్‌ మోటార్స్‌ వంటి సంస్థలు పాల్గొంటాయని అందరూ భావిస్తే, కేవలం గోల్డ్‌స్టోన్‌ అనే సంస్థ మాత్రమే పాల్గుంది. ఈ గోల్డ్‌స్టోన్‌ పై ఇప్పటికే తెలుగుదేశం ఆరోపణలు చేస్తుంది. ఇది మేఘా సంస్థ అని, పోలవరంలో మిగిలింది, ఇక్కడ కవర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టే, ఇక్కడ కేవలం గోల్డ్ స్టోన్ మాత్రమే టెండర్ వేసింది. అద్దెను రూ.60కి తగ్గకుండా ఇవ్వాలన్న ప్రతిపాదన, ఈ కంపెనీ ఆర్టీసి ముందు పెట్టింది. అయితే ఇందుకు, ఆర్టీసి ఎండీగా ఉన్న సురేంద్రబాబు అందుకు ఒప్పుకోలేదు.

ప్రుస్తుతం ఉన్న అద్దె బస్సులకు కిలోమీటరుకు రూ.38 ఇస్తున్నాం అని, అయినా ఇక్కడ 5 రూపాయల నష్టం వస్తుందని, అలాగే ఎలక్ట్రిక్‌ బస్సుల అద్దె తెలంగాణలో రూ.36తో గోల్డ్‌ స్టోన్‌ సంస్థ ఇప్పటికే దక్కించుకుందని తెలిపారు. టెండర్ వేసి, ఎవరు తక్కువకి కోడ్ చేస్తే వాళ్ళకే ఇస్తాం అన్నారు సురేంద్రబాబు. దీనిపై చర్చలు జరుగుతుండగానే, ఆయనపై వేటుపడింది. ఇది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వారి నుండే బస్సులను అద్దెకు తీసుకోవాలని, దానికి అడ్డుగా ఉన్న సురేంద్రను తప్పించినట్టు స్పష్టం అవుతుంది. ఏదిఏమైనా ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ కి నష్టాలు వస్తే ప్రభుత్వమే భరిస్తుందా .. మళ్ళీ ప్రయాణికుడికే చార్జీల మోత. ఎక్కడ ఏ స్కాం జరిగినా, బాద్యుడు మాత్రం సామాన్యుడే.

Related posts