telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

బీజేపీకి భారీ ఎదురుదెబ్బ.. ఒక్కసారే 12 మంది పార్టీ నుండి జంప్ ..

against bjp trying to apply last weapon as mp resigns

అధికార బీజేపీ కి ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్‌లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒకేసారి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి విపక్ష నేషనలిస్ట్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ)లో చేరిపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభతోపాటు అరుణాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అరవై అసెంబ్లీ స్థానాలున్న అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రేమ్ ఖండు నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పాలన సాగిస్తోంది.

ఒకపక్క మళ్లీ గెలుపే లక్ష్యంగా కమలనాథులు వ్యూహ రచన చేస్తుంటే, మరోపక్క దేశంలో ఉన్న వ్యతిరేకతతో.. వివిధ రకాల ఆరోపణలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీనితో గెలిచే అవకాశాలులేని సిట్టింగ్‌లను అధిష్ఠానం పక్కన పెట్టింది. ఇలా టికెట్లు రానివారు మొత్తం 12 మంది ఉండగా అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉండడం విశేషం. అయితే అధిష్ఠానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేని వీరంతా తిరుగుబాటు చేశారు. మూకుమ్మడిగా రాజీనామా చేసి ఎన్‌పీపీలో చేరిపోయి బీజేపీ అధిష్ఠానానికి గట్టి షాక్‌ ఇచ్చారు.

Related posts