telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మోదీతో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి భేటీ

komati-venkat-reddy mp

ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా పలు విషయాలపై నిశితంగా చర్చించారు. ముఖ్యంగా నాలుగు అంశాలపై ప్రధానికి కోమటిరెడ్డి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. హైదరాబాద్‌లో ఫార్మాసిటీ ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు నిలిపివేయాలని ఆయన కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ఫార్మాసిటీ వల్ల హైదరాబాద్‌పై కాలుష్య ప్రభావం ఉంటుంది. హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు నుంచి కొత్తగూడెం వరకు జాతీయ రహదారిగా చేయాలని మోదీని కోరాం. మూసీనది శుద్ధికి రూ.3 వేల కోట్లు కేటాయించాలి. సివరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించాలని ప్రధానిని కోరినట్టు కోమటిరెడ్డి తెలిపారు.

Related posts