telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికల వాయిదా ఏకపక్ష నిర్ణయం: వైసీపీ ఎంపీ లావు

lavu krishna devaraya

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల వాయిదా నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాట్లా యుద్దం జరుగుతోంది. ఇప్పటికే హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా ఈ వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. ఈ వాయిదా విషయాన్ని వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు లోక్‌సభలో ప్రస్తావించారు.

ఎన్నికల వాయిదా ఏకపక్ష నిర్ణయమని ఆయన ఆరోపించారు. కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయమని అన్నారు. ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని ఎంపీ లావు విజ్ఞప్తి చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.5100 కోట్లు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా లోక్‌సభలో లావు ప్రస్తావించారు.

Related posts