telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇండియాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన అమెరికా…

Joe Biden USA

భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మన దేశంలో కరోనా కేసులు రోజుకు 3 లక్షలను పాగా నమోదవుతున్నాయి విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న ఇండియాకు సహాయం చేసేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్నాయి.  ఇందులో భాగంగా అమెరికా కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.  భారత్ కు అవసరమైన సహాయం చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.  ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.  కరోనా మొదటి వేవ్ సమయంలో అమెరికాకు ఇండియా సహాయం చేసిందని, సెకండ్ వేవ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్ కు తాము తప్పకుండా సహాయం చేస్తామని అన్నారు.  కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.  కరోనా కట్టడికి భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. చూడాలి మరి దీని పై భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts