ఏపికి రూ. 344 కోట్లు కేంద్రం ప్రత్యేక సహాయం అందించింది. ఏపిలో విజయవంతంగా పౌర సేవల సంస్కరణల అమలుకు ప్రత్యేక రివార్డ్ కింది ఈ సహాయాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు రివార్డులు ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ…. రివార్డులో భాగంగా “ప్రత్యేక సహాయం” కింద రెండు రాష్ట్రాలకు రూ. 1,004 కోట్లు రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ కు రూ. 344 కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ. 660 కోట్లు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం అందించింది. పౌరసేవల సంస్కరణల్లో నాలుగింట మూడు అమలు చేసినందుకు రివార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. “వన్ నేషన్-వన్ రేషన్ కార్డ్”, “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”, “పట్టణ స్థానిక సంస్థల సంస్కరణలు” అమలు చేసిన ఏపీ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సహాయం అందించింది.
previous post
next post
దీపికా ‘సైకో’, రణబీర్ ‘రేపిస్ట్’… కంగనా సంచలన వ్యాఖ్యలు