telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీకి ఎందుకు రాలేదంటే… నందమూరి చిన్నల్లుడి కామెంట్స్

Balakrishna

టాలీవుడ్ లో హీరోల వారసులు చాలామందే వెండితెర ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఇస్తూనే ఉన్నారు. అయితే హీరోల కూతుర్లు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా అరుదు. ఇప్పటికే మన ఇండస్ట్రీలో మోహన్ బాబు గారి అమ్మాయి లక్ష్మిగారు, నాగబాబు గారి అమ్మాయి నిహారిక వచ్చారు. అయితే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరూ సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు. దీంతో వారెందుకు సినిమా ఇండస్ట్రీ వైపు రాలేదు ? అనే అనుమానం నందమూరి అభిమానులకు కూడా కలిగింది. అయితే బాలయ్యకు వాళ్ళ సినిమా ఎంట్రీ ఇష్టం లేదేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఆయన కూతుళ్లు ఎందుకు నటన వైపు రాలేదు అనే విషయంపై బాలయ్య చిన్నల్లుడు భరత్ స్పందించారు. “సాధారణంగా మన ఇండస్ట్రీలో వారసురాళ్లను సినిమాల వైపు రానివ్వడం తక్కువ అని చెప్పాడు భరత్. . ఇంకా వస్తారనే అనుకుంటున్నాను. ఇక నందమూరి అక్కా చెల్లెళ్లు ఇద్దరూ అందంగా ఉంటారని, వాళ్లకు నటించే శక్తి కూడా ఉందని, కానీ వాళ్ల కారణాలు వాళ్లకు ఉన్నాయని చెప్పాడు భరత్. మరీ ముఖ్యంగా తన భార్య తేజస్వినికి సినిమాలంటే ఆసక్తి ఎక్కువే అని ఒప్పుకున్నాడు ఈయన. నటించాలని ఉండకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు సినిమా ప్రొడక్షన్ వైపు వస్తుందనే నమ్మకం అయితే ఉందంటున్నాడు భరత్. తన భార్య తేజస్విని బాగా నటిస్తుందని, డాన్సులు కూడా చేస్తుందని… ఒక వేళ ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఉంటే మంచి హీరోయిన్ అయ్యుండేదేమో అని చెప్పాడు భరత్. అయితే బాహ్మణి గారికి తేజస్వినితో పోలిస్తే సినిమాలపై ఆసక్తి తక్కువే అని, ఆమెకు బిజినెస్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు భరత్. ఇక తేజస్విని సినిమాల్లోకి వస్తానంటే మాత్రం తానెప్పుడూ లిమిటేషన్స్ మాత్రం పెట్టనంటున్నాడు భరత్. అది పూర్తిగా ఆవిడ ఇష్టం.. సినిమాల వైపు వస్తానంటే తనకేమీ అభ్యంతరం లేదంటున్నాడు. దీంతో తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందా ? అనే అనుమానం మొదలైంది నెటిజన్లలో…!

Related posts