telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా నిలబడ్డా… నేను యాంకర్ సుమలా కాదు… అనసూయ కామెంట్స్

Anasuya

తెలుగులో వస్తున్న “జబర్ధస్త్” కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలు అంటూ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. అనసూయ యాంకర్ గా పాపులారటీతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ పెళ్లి చేసుకుని, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన త‌ర్వాత కూడా అన‌సూయ‌ గ్లామ‌ర‌స్ యాంక‌ర్‌గా రాణిస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన “కథనం” సినిమా విడుదలయింది. తాజాగా రంగమ్మత్త యూఎస్‌లో సందడి చేసింది. అక్కడి చల్లటి మంచు గాలిలో పొట్టి పొట్టి డ్రస్సుల్లో సందడి చేసింది. చిన్న నిక్కర్ వేసుకొని పొట్టి టాప్‌తో ఫోటోలు దిగింది. ఇక ఆ ఫోటోల్ని ఏ మాత్రం లేట్ చేయకుండా తన సోషల్ మీడియాలో పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హాట్ ఫోటోల్ని పెట్టేసింది. అమెరికాలో అనసూయ డ్రెస్సింగ్ చూసి అభిమానులంతా ఫిదా అయిపోతున్నారు. అయితే ఏంటీ డ్రెస్సింగ్ అంటూ కొందరు అనసూయపై ఫైర్ అవుతున్నారు. అయితే వీటిని అనసూయ ఏమాత్రం లెక్కచేయడం లేదు సరికదా… “అన్నీ విప్పుకుని నగ్నంగా నిలబడ్డా ఆ దృష్టితో చూడకూడదు… నా డ్రెస్ నా ఇష్టం… యాంకర్ సుమలా నేను కాదు.. నాలా సుమ ఉండొచ్చుగా.. వస్త్రధారణపై అలా ఉండాలి ఇలా ఉండాలి అని జడ్జ్ చేసే హక్కు మీకెక్కడిది…” అంటూ తన హాట్ నెస్‌ని ప్రశ్నించే వారికి ఘాటుగానే సమాధానం ఇస్తుంది అనసూయ. దీంతో ఇప్పుడు అనసూయ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. యాంకర్ సుమ డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేయడంతో సుమ అభిమానులు అనసూయపై ఫైర్ అవుతున్నారు.

Related posts