telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పేదల కోసమే డబుల్ బెడ్ రూమ్ పథకం : మంత్రి హరీశ్‌ రావు

Harish Rao trs

పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు సీఎం కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకువచ్చారని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. కాస్త ఆలస్యమైనా ఇండ్లు ప్రారంభించు కోవడం చాలా సంతోషంగా ఉందని… కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఇండ్లకు 40 వేలు మాత్రమే ఇచ్చేవారని… అవి బెస్ మెంట్ పనులకే సరిపోయేవన్నారు. అప్పుడు ఇండ్లు కడితే అప్పులపాలు అయ్యేవారని… చివరకు ప్లాట్లు కూడా అమ్మేవారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి హారీశ్‌ రావు. పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికెందుకు డబుల్ బెడ్ రూమ్ పథకమని… ఇండ్ల కోసం ఎవరికి లంచం ఇచ్చినా.. తీసుకున్నా.. కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు హరీశ్‌ రావు. రంగనాయక సాగర్ ఉన్నంత వరకు ఇక్కడి రైతుల పేరు ఉంటుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తెలంగాన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. జాతీయ పార్టీలు వస్తాయి.. పోతాయి కానీ టీఆర్‌ఎస్‌ ఎప్పుడు లోకల్‌ అని పేర్కొన్నారు మంత్రి హరీశ్‌ రావు. మరో 20 ఏళ్ల పాటు తమదే విజయమన్నారు. 

Related posts