telugu navyamedia
రాజకీయ వార్తలు

వచ్చె నెలలో అయోధ్యలో భూమిపూజ..మోదీ హాజరైతే రాజ్యాంగ వ్యతిరేకమే: ఒవైసీ

asaduddin owisi

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నట్టు వస్తున్న వార్తలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. భూమి పూజకు అధికారిక హోదాలో ప్రధాని హాజరైతే రాజ్యాంగ వ్యతిరేకమవుతుందని అన్నారు.

తద్వారా ప్రధాని పదవి చేపట్టేటప్పుడు చేసిన రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టేనని ట్వీట్ చేశారు. లౌకికవాదం భారత రాజ్యాంగానికి ప్రాథమిక పునాది అని ఒవైసీ తెలిపారు. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ఓ నేరస్థుల సమూహం 1992లో కూల్చివేసిన సంఘటనను తాము మర్చిపోలేమని ఒవైసీ వ్యాఖ్యానించారు.

Related posts