telugu navyamedia
రాజకీయ వార్తలు

గెహ్లాట్ తప్పులు కాంగ్రెస్ నేతలకు కనిపించవు: మాయావతి

mayawati

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పులు కాంగ్రెస్ నేతలకు కనిపించవని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. బీఎస్పీని వేలెత్తి చూపించడమే వారికి తెలుసని మండిపడ్డారు. వాళ్ల తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ కీలుబొమ్మ బీఎస్పీ అనే ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ తరపున గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలు గత ఏడాది కాంగ్రెస్ లో చేరారు. ఈ అంశంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్టు ఆమె చెప్పారు. రాజస్థాన్ అసెంబ్లీలో బలపరీక్షను నిర్వహిస్తే… కాంగ్రెస్ కు బీఎస్పీ తరపున గెలిచిన వారెవరూ ఓటు వేయకూడదని ఆమె హెచ్చరించారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి షరతులు లేకుండానే కాంగ్రెస్ కు తాము మద్దతు ప్రకటించామని ఆమె అన్నారు. అయితే రాజ్యాంగ విరుద్ధంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ద్రోహం క్షమించలేనిదని చెప్పారు. కాంగ్రెస్ కు త్వరలోనే గుణపాఠం నేర్పుతామని అన్నారు.

Related posts