భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే నేడు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్) పై మాట్లాడాడు. డీఆర్‌ఎస్ లో అంపైర్స్ కాల్ విధానం గందరగోళం సృష్టిస్తోందని అన్నాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి కొద్దిగా వికెట్లను తాకినా.. ఎల్‌బీడబ్ల్యూ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. భవిష్యత్తులో పెద్ద టోర్నీలు జరగబోతున్నాయని.. క్రీడా స్ఫూర్తి, మార్గదర్శకాలను ప్రశ్నించాల్సిందే అని కోహ్లీ అంటున్నాడు. డీఆర్‌ఎస్ లేనప్పుడూ నేను సుదీర్ఘంగా క్రికెట్ ఆడాను. బ్యాట్స్‌మెన్‌కు ఇష్టమున్నా లేకున్నా అంపైర్ తీసుకున్న నిర్ణయం అలాగే ఉంటుంది. అంతేకాకుండా నిజానికి ఔటైనా బంతి కొద్దిగా వికెట్లను తాకినా అంపైర్ నాటౌట్ ఇస్తే ఇక అంతే. కానీ బెయిల్స్ ఎగిరాయంటే ఔటైనట్టే లెక్క’ అని కోహ్లీ అన్నాడు. అంపైర్స్ కాల్ నిబంధనను పునః పరిశీలించాలని ఇప్పటికే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఐసీసీకి సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అంపైర్స్ కాల్‌ను సవాల్ చేస్తే బాల్ ట్రాకింగ్‌లో బంతి 50% వికెట్లను తాకితేనే ఔటిస్తున్నారు. కానీ ఆ విధానాన్ని మార్చాలని చాలా మంది మాజీలు కూడా ఐసీసీకి సూచిస్తున్నారు.
previous post
next post
జానారెడ్డి పెద్ద కొడుకుగా ఉంటా : రేవంత్ రెడ్డి