telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఎంబీబీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపును రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు…

తెలంగాణ హైకోర్టు ఎంబీబీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో ఈనెల 19, 20 తేదీలలో  ఎంబీబీఎస్‌ రెండోవిడత కౌన్సిలింగ్ జరిగింది. అయితే ఎంబీబీఎస్​ సీట్ల కౌన్సెలింగ్​ తీరుపై స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయ్‌. ఫస్ట్​ ఫేజ్​ కౌన్సెలింగ్​లోని  స్లైడింగ్​లో మిగిలిన సీట్లను భర్తీ చేశాకే  సెకండ్​ ఫేజ్​ కౌన్సెలింగ్​ చేపట్టాలి. కానీ నేరుగా సెకండ్​ ఫేజ్​​ కౌన్సెలింగ్​కు ఆఫీసర్లు నోటిఫికేషన్​ ఇచ్చారని ఆందోళన చెందారు విద్యార్థులు. దీనిపై స్టూడెంట్​ యూనియన్స్​, బీసీ, ఎస్సీ, ఎస్టీ  సంఘాలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం  చేశాయి. స్లైడింగ్‌లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లలో తప్పులు జరిగాయని విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని బాధిత విద్యార్థులు ఆరోపించారు.దీంతో ఎంబీబీఎస్ అడ్మిషన్లపై కీలక ఆదేశాలు  ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. రెండో విడత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కాళోజీ వర్సిటీకి ఆదేశాలు ఇచ్చింది ధర్మాసనం.అటు ఏపీలోనూ ఇప్పటికే ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ రద్దైంది. కోర్టు కెళ్లిన అభ్యర్థులను రెండోవిడత కౌన్సిలింగ్‌కు అనుమతించాలని ధర్మాసనం ఆదేశించింది.

Related posts