telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులా ?: విజయశాంతి

Congress vijayashanti comments Modi Kcr

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట్లో కుక్కకు జ్వరం వచ్చి చనిపోతే డాక్టర్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సినీ నటి, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. తెలంగాణలో ప్రజలు జ్వరాలతో పిట్టల్లా రాలిపోతున్నా కూడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. కానీ, కేసీఆర్ కుటుంబం ప్రేమగా పెంచుకొన్న కుక్క చనిపోతే ఆ కుక్కకు వైద్యం చేసిన డాక్టర్ రంజిత్ పై కేసు పెట్టినట్టు వచ్చిన వార్తను చూసి తెలంగాణ సమాజం నివ్వెరపోయిందన్నారు.

సీఎం ఇంట్లో కుక్క ప్రాణాలకు ఉన్న విలువ తెలంగాణ ప్రజలకు లేదనివిమర్శలు చేశారు. విషజ్వరాల బారినపడి తెలంగాణలో ప్రజలు చనిపోతున్నా కనీస జాగ్రత్తలు తీసుకోని ఆరోగ్యశాఖాధికారులపై చర్యలు లేవని ఆమె విమర్శించారు. గ్లోబరీనా సంస్థకు ఇంటర్ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పజెప్పి ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పుకు చాలా మంది విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయినా కూడ ఇందుకు బాధ్యులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్నిఆమె గుర్తు చేశారు.

Related posts