telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు .. కిటకిటలాడుతున్న ఆలయాలు…

gurupournami celebrations today

తల్లితండ్రి, గురువు, దైవం అన్నారు. అంటే గురువు అటు బాహ్య బంధాలకు, ఇటు ఆత్మబంధం(భగవంతుడు) కు మధ్య జీవిని సమన్వయంతో ఎలా జీవించాలో ప్రతిక్షణం బోధిస్తుంటాడు. అటువంటి గురువు ను నేడు పూజించుకోవడం ఉత్తమం. తల్లితండ్రి మొదటి గురువు అంటారు.. అక్కడి నుండి ప్రారంభమైన ఈ పరంపర నిజమైన గురువు దగ్గర ఆగి, మోక్ష మార్గానికి దిశానిర్దేశం వరకు జీవికి తోడుగా ఉంటుంది. అలా బాహ్య ప్రపంచం నుండి భగవంతుని చేరేవరకు గురువు ప్రాధాన్యత ఎంతో ఉంది. నేడు గురుపౌర్ణమి సందర్భంగా, దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

సద్గురువు సాయిబాబా ఆలయాలన్నీ సాయి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయాన్నే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. గురుపూర్ణిమను పురస్కరించుకుని ఆలయాలను సర్వాంగసుందరంగా అలంకరించారు. మహారాష్ట్రలోని షిరిడీసాయిబాబాను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు తరలివచ్చారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు కూడా భక్తులతో రద్దీగా మారాయి.

Related posts