telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎంత పరివర్తన”… కార్తికేయకు మెగాస్టార్ సర్ప్రైజ్ మెసేజ్

Karthikeya

“ఆర్ఎక్స్ 100” చిత్రంతో యూత్ ను ఫిదా చేసిన నటుడు కార్తికేయ. ఈ త‌ర్వాత గుణ 369, 90 ఎల్ అనే చిత్రాల‌లో న‌టించారు. కానీ ఈ చిత్రాలేవీ కార్తికేయకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ప్ర‌స్తుతం “చావు కబురు చల్లగా” అనే మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ఫస్ట్ లుక్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకుంది. బస్తీ మాస్ కుర్రాడిగా సంద‌డి చేయ‌నున్నాడు. ఇటీవ‌ల ఈ యంగ్ హీరో ష‌ర్ట్ లెస్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. సిక్స్ ప్యాక్ తో కుర్రోడు అద‌ర‌గొట్టాడు. కార్తికేయ‌ కండ‌ల‌ను చూసిన మెగాస్టార్ చిరంజీవి ఓ సందేశం పంపార‌ట‌. ఇటీవలే‌ ఓ ఇంటర్వ్యూలో కార్తికేయనే ఈ విషయాన్ని చెప్పాడు. చిరంజీవి ‘ఎంత పరివర్తన’ అంటూ సిక్స్ ప్యాక్ కోసం తాను పడిన కష్టాన్ని గుర్తు చేస్తూ తనకు సర్ ప్రైజ్ మెసేజ్ పంపాడని కార్తికేయ వెల్ల‌డించాడు. అస‌లే మెగాస్టార్ ని దేవుడిగా భావిస్తాడు కార్తికేయ‌. ఆయ‌న నుంచి ఊహించని రీతిలో ప్రశంసలు దక్కడంతో కార్తికేయ తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Related posts