telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఈరోజు బంగారం ధరలు ఇలా…

gold-biscuits hyd

కరోనా వైరస్‌ ప్రభావంతో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగిపోయాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు క్రమంగా పెరిగిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ అయిపోగానే బంగారం ధరలు దిగివచ్చాయి. దీపావళి కంటే ముందు బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా వైరస్‌ విజృంభించిన తర్వాత బంగారం ధరలు చుక్కలు చూపించిన ఇప్పుడు మళ్ళీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. కానీ ఈరోజు ఢిల్లీలో హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. కరోనా అనంతరం 50 వేల ను దాటింది. అయితే ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 53,730 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 పెరిగి రూ. 49,260 వద్ద ముగిసింది. అయితే మంగళవారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.47,110కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ. 51,390 కి చేరింది. అయితే ఈరోజు కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ. 73,600 పలుకుతుంది.

Related posts