telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ మూడో విడత రేపటి నుండి అమలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రభుత్వం కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాల అమలు విషయం ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు మూడవ విడత వైఎస్సార్‌ నేతన్న నేస్తంను అమలు చేయనున్నారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక్కొక్కరి అకౌంట్లో రూ.24 వేల చొప్పున వేయనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు చొప్పున నగదు జమకానుంది.

రాష్ట్రవ్యాప్తంగా 80,032 మంది లబ్ధిదారుల ఖాతాల్లోరూ.192.08 కోట్లు వేయనున్నారు జగన్. కాగా, మూడు విడుతలు కలుపుకుని ఇప్పటి వరకూ 576 కోట్లు అందించింది ప్రభుత్వం.. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం కింద ఒక్కొక్కరికి ఇప్పటి వరకూ రూ.72 వేల రూపాయల లబ్ధి చేకూర్చింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా ఐదేళ్లలో ఒక్కొక్క చేనేత కుటుంబానికి లక్షా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేయనుంది ప్రభుత్వం.

Related posts