కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవీ శతజయంతి కమిటీ సమావేశంలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పీవీకి అన్ని అవకాశాలు ఇచ్చిందని అన్నారు. సోనియాగాంధీ అవకాశం ఇచ్చారు కాబట్టే పీవీ ప్రధాని అయ్యాడని వ్యాఖ్యానించారు. పీవీ రాజకీయ సన్యాసం తీసుకునే వేళ సోనియాఆయనకు ప్రధాని పదవి ఇచ్చిందని అన్నారు.
పీవీ కుటుంబ సభ్యులు తమ వ్యాసాలతో సోనియాగాంధీని విమర్శించడం సరి కాదని వీహెచ్ అన్నారు. గాంధీభవన్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతులు నిర్వహించినట్టుగానే ఇతర నాయకులవి కూడా నిర్వహించాలని వీహెచ్ అన్నారు. వచ్చే సంవత్సరం దామోదరం సంజీవయ్య శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
ఏపీ మెజారిటీ ప్రజలు రోడ్ల మీదకు వస్తే హైదరాబాద్ పరిస్థితేంటి: శివాజీ