telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా టైమ్ లో కూడా రైతు బందు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే

ktr telangana

దేశంలోని రైతు కన్నీరు ఢిల్లీలో కనపడుతోంది.. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ్టి భారత్‌ బంద్‌ లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు చేసే చట్టాలు నచ్చన్నప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రజలకు వుందని.. ప్రజలు నిరసన తెలిపినప్పుడు ఆ చట్టాలను రద్దు చేయటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల పద్దతి తెలిపారు. కానీ బిజెపి ప్రభుత్వానికి ఆ ప్రజాస్వామ్య లక్షణం లేదని.. ఈ చట్టం లో మద్దతు ధర అనే అంశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తులతో కొట్లాడే శక్తి రైతులకు లేదని… మార్కెట్ కమిటీలు కొనడం ద్వారా రైతుకు మద్దతు ధర దొరుకుతుంది అనే నమ్మకం వుంటుందన్నారు. ఎక్కడికి అంటే అక్కడికి వెళ్లి పంటను రైతుకు అమ్ముకునే శక్తి ఉందా.. కార్పొరేట్ లే ఇక్కడికి వచ్చి అంతో.. ఇంతో ఇచ్చి కొనుక్కోని పోతారని ఫైర్‌ అయ్యారు. దీంతో నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని..తర్వాత ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. అన్నం పెడుతున్న రైతుకు సున్నం పెడుతున్న ఈ విధానాన్ని ఊరురు తిరిగి చెప్తామని..రైతులకు ద్రోహం చేస్తే వూరుకునేది లేదని హెచ్చరించారు. కరోనా టైమ్ లో కూడా రైతు బందు ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని.. పాలమూరు లాంటి వెనక బడ్డ జిల్లాలకు మళ్లీ రివర్స్ వలసలు వస్తున్నాయన్నారు. వ్యవసాయం అనేది రాష్ట్ర లోని అంశం.. కానీ రాష్ట్రాల హక్కులు కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Related posts