telugu navyamedia
రాజకీయ

దీపావళి నాటికి జియో 5జీ సేవలు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశంలో జియో 5జీ సేవలపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. జియో 5జీ ప్రపంచంలోనే అత్యంత విలువైన సేవలు అందించే సంస్థగా నిలుస్తుందని చెప్పారు. భారత డిజిటల్‌ సేవలను అందించడంలో రిలయన్స్‌ ఎపుడు ముందు ఉందని అంబానీ చెప్పారు.

దీపావళి నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో దీపావళి నాటికి జియో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.ముందుగా ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్ కతా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.  

దేశవ్యాప్తంగా జియో 5జీ ట్రూ సేవల కోసం 2 లక్షల కోట్లు రూపాయలు  వెచ్చించనుందని తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి దేశం మొత్తం జియో 5జీ సేవలు విస్తరిస్తామని వెల్లడించారు. అలాగే జియో ఎయిర్‌ ఫైబర్‌ పేరుతో బ్రాండ్‌ సేవలను ప్రారంభిస్తామన్నారు.

రిలయన్స్‌ అన్ని రంగాల్లో రాణించింది. రిలయన్స్ ఎగుమతులు 75 శాతం పెరిగి రూ.2.50 లక్షల కోట్లకు చేరుకున్నాయని ముఖేశ్‌ అంబానీ తెలిపారు. గత ఏడాది 6.8 శాతంగా ఉన్న భారతదేశ సరుకుల ఎగుమతుల్లో తమ వాటా దాదాపు 8.4 శాతం అని పేర్కొన్నారు. రిలయన్స్ తన వ్యాపారాలలో ఆల్ రౌండ్ పురోగతిని కొనసాగిస్తూనే ఉందన్నారు.

వార్షిక ఆదాయాలలో100 బిలియన్లను దాటిన భారతదేశపు మొదటి కార్పొరేట్ సంస్థగా నిలిచామన్నురు. రిలయన్స్ ఏకీకృత ఆదాయాలు 47 శాతం వృద్ధి చెంది రూ. 7.93 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎబిట్టా మార్జిన్లు రూ. 1.25 లక్షల కోట్ల కీలకమైన మైలురాయిని దాటింది. వుయ్ కేర్ స్ఫూర్తితో, రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా మిలియన్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తోందని అంబానీ వెల్లడించారు.

అలాగే రిలయన్స్ మీడియా బిజినెస్ గడిచిన ఏడాదిలో వృద్ధి నమోదు చేసిందని ముకేశ్ అంబానీ తెలిపారు. సబ్ స్ర్కిప్షన్లు, ప్రకటనల ఆదాయం మరింత గణనీయ వృద్ధి నమోదుచేసిందని ఎంటర్ టైన్ మెంట్ విభాగం, మీడియా ఛానెళ్లలు దూసుకెళ్తున్నాయన్నారు. ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులు రిలయన్స్ దక్కించుకున్నాయన్నారు. మూవీ రైట్స్, ఓటీటీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.

 

 

 

 

 

 

 

 

Related posts