telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ : … పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో … థార్ ఎక్స్‌ప్రెస్‌ తాత్కాలికంగా రద్దు ..

special train between vijayawada to gudur

ఇండియన్ రైల్వే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి కరాచీని కలుపుతూ వెళ్లే థార్ లింక్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను కశ్మీర్ అంశంపై పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేసింది. నేడు వెళ్లాల్సిన థార్ లింక్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరలేదని వాయవ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి అభయ్ శర్మ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుల (అప్ అండ్ డౌన్) రద్దు కొనసాగుతుందని ఆయ చెప్పారు. పాకిస్థాన్ వెళ్లేందుకు ఈ రైలులో 45 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టు తెలిపారు.

పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ 9వ తేదీన ఇస్లామాబాద్‌లో ఒక ప్రకటన చేస్తూ, జోథ్‌పూర్‌కు వెళ్లే నేటి రైలే చివరి రైలు అవుతుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాక్…ఇందుకు ప్రతిగా భారత్‌తో దౌత్యసంబంధాలకు ఉద్వాసన చెబుతున్నట్టు ప్రకటించింది. రెండు దేశాల మధ్య నడిచే థార్, సంజౌతా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసింది.

Related posts