telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీకి విజయమ్మ రాజీనామా-ప్లీనరీలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు సంచలన ప్రకటన చేశారు.  వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి, పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 

తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తోందని, ఆమెకు తాను అండగా నిలవాల్సి అవసరముందని వ్యాఖ్యానించారు. షర్మిలతో కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. 

కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసిన దాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది..

తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిందన్నారు. ఈ సమయంలో షర్మిలకు తోడుగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీపీలోనూ సభ్యత్వం ఉండాలా వద్దా అనేదానిపై చాలా ఆలోచించానన్నారు. ఇద్దరికీ తల్లినే కాబట్టి.. ఇద్దరి భవిష్యత్తు కోసం చేతనైన సహకారం అందించానన్నారు.

విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా ఉండేందుకే వైఎస్ఆర్ సీపీలో గౌరవాధ్యక్షురాలి పదవిలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఒక తల్లిగా ఎప్పుడూ జగన్ కు అండగా ఉంటానని, అలాగే వైఎస్ షర్మిలకు తోడుగా ఉంటానని అన్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదని మాట్లాడారు.

Related posts